వారణాసి సెట్ నుంచి మరో లీక్.. జక్కన్న టీమ్ షాక్

వారణాసి సెట్ నుంచి మరో లీక్.. జక్కన్న టీమ్ షాక్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌వరల్డ్ చిత్రం ‘వారణాసి’ నుంచి మరో సీన్ లీక్ కావడంతో చిత్ర బృందం షాక్‌కు గురైంది. ఇప్పటికే టీజర్‌ సమయంలో డ్రోన్ షాట్, ఒడిశా షెడ్యూల్‌లో కీలక విజువల్స్, మహేష్ రాముడి గెటప్ వీడియో లీక్ అయ్యాయి. తాజాగా వారణాసి సెట్‌లో మహేష్‌పై చిత్రీకరిస్తున్న సన్నివేశాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో రాబోయే షెడ్యూల్స్‌కు భద్రత పెంచి లీకులకు చెక్ పెట్టేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies