అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలంటూ వైసీపీ నిరసన దీక్షకు సిద్ధమవుతుండగా, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అదే ప్రాంతంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీల కార్యక్రమాలు ఒకేసారి జరగనుండటంతో పోలీసులు భారీ బలగాలను మోహరించి నిఘా పెట్టారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వంలో జరిగే ఈ దీక్షకు అనుమతి ఇస్తారా లేదా అనే ఉత్కంఠ నడుస్తోంది.
అనంతపురంలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి హీట్
Source: telugutimes.net
Read the live feed on ZapIndies