తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం విషాదం చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న రంజీత్ (8) తరగతి గదిలో పాము కాటుకు గురయ్యాడు. ఉపాధ్యాయులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా విషం శరీరమంతా వ్యాపించడంతో బాలుడు మృతి చెందాడు. పాఠశాలలో పరిశుభ్రత లోపించడంతో పాములు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపేటలో విద్యార్థి పాము కాటుతో మృతి
Source: Zee Telugu News
Read the live feed on ZapIndies