కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్థిక భరోసా కోసం ప్రతిష్టాత్మక 'నేతన్న సేవలో' పథకాన్ని నేడు ప్రారంభించనుంది. ఇప్పటికే 50 ఏళ్లు పైబడిన వేలాది మందికి నెలకు రూ.4,000 పింఛను, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా పదివేల పవర్లూమ్, అరవై వేల చేనేత కుటుంబాలు లబ్ధి పొందుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
నేతన్న సేవలో పథకానికి నేడు శ్రీకారం
Source: Vaartha
Read the live feed on ZapIndies