అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం 2029 జనవరి 20న ముగిసే వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ట్రంప్ తమతో ఎప్పటికీ ఒప్పందానికి రారని, ఆయన పదవీకాలం పూర్తయ్యే వరకు ప్రస్తుత విధానాన్నే అనుసరిస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ సలహాదారు మజిద్ షాకేరి తెలిపారు. 300 బిలియన్ డాలర్ల నష్టపరిహారం, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, పశ్చిమాసియా నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ వంటి డిమాండ్లను అంగీకరిస్తేనే హార్ముజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ పేర్కొంది.
2029లో ట్రంప్ దిగిపోయేవరకు చర్చలు లేవని ఇరాన్ ప్రకటన
Source: News18 Telugu
Read the live feed on ZapIndies