బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలను వేగవంతం చేయడం లక్ష్యంగా జిల్లాల కలెక్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలు విధుల్లో నిమగ్నమయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800 4250101 అందుబాటులో ఉన్నాయి.
ఏపీలో భారీ వర్షాలు: కంట్రోల్ రూమ్ నంబర్లు విడుదల
Source: Vaartha