జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో రాష్ట్ర హోదా పునరుద్ధరణ డిమాండ్‌పై బీజేపీ ఎమ్మెల్యేలు సభ మధ్యలోకి దూసుకెళ్లి గందరగోళం సృష్టించారు. ఒక బీజేపీ సభ్యుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మైక్రోఫోన్లు విసిరేందుకు ప్రయత్నించగా, ఇద్దరు బీజేపీ సభ్యులను బయటకు పంపించారు. స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. స్వయంప్రతిపత్తితో కూడిన రాష్ట్ర హోదా కల్పించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల గందరగోళం
Source: Vaartha