ముంబైలోని సుమారు 12 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. నటి రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత వాషు భగ్నానీ ఇళ్లతో పాటు పనోరమా స్టూడియోస్ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరిగాయి. సినీ నిర్మాణ ఖర్చులు, విదేశీ షూటింగ్‌లు, ఓవర్సీస్ చెల్లింపులపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఐటీ శాఖ నుంచి అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
బాలీవుడ్‌లో ఐటీ సోదాలు: రకుల్ ప్రీత్ సింగ్, వాషు భగ్నానీ ఇళ్లలో తనిఖీలు
Source: Chitrajyothy