అమెరికా వెళ్లేందుకు అక్రమ మార్గంలో ఇథియోపియా చేరిన ముగ్గురు గుజరాత్ వాసులు అదృశ్యమయ్యారు. సెప్టెంబర్ 20న గుజరాత్ నుంచి బయలుదేరిన వీరితో సెప్టెంబర్ 22 తర్వాత కుటుంబాలకు సంబంధం తెగిపోయింది. వీరిని బందీలుగా ఉంచి విడుదల కోసం రూ. కోటి డిమాండ్ చేసినట్లు కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.
ఇథియోపియాలో ముగ్గురు గుజరాతీయులు అదృశ్యం
Source: Gulte Telugu