ఆంధ్రప్రదేశ్‌లో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పోలీసుల ముందస్తు అనుమతి ఉన్న మండపాలకే ఈ సదుపాయం వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్ల వరకు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. ఈ నిర్ణయంపై భక్తులు, ఉత్సవ కమిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దసరా నవరాత్రులకు దుర్గా మండపాలకు ఉచిత విద్యుత్
Source: Vaartha