అమరావతిలో అంతర్జాతీయ స్థాయి చెస్ అకాడమీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రఖ్యాత చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి ప్రతిపాదనపై మంత్రి నారా లోకేశ్ సానుకూలంగా స్పందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో హంపి, ఆమె తండ్రి అశోక్‌ను కలిసిన ఆయన, ఒలింపియాడ్‌లో ఆమె ప్రతిభను అభినందించారు. అకాడమీకి స్థలం, మౌలిక వసతులు అందిస్తామని హామీ ఇచ్చారు.
అమరావతిలో చెస్ అకాడమీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం
Source: Vaartha