చార్మింగ్ స్టార్ శర్వా హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'భోగి' చిత్రం నుంచి తొలి సింగిల్ 'ఎగిలివరంగ' విడుదలైంది. 1960ల గ్రామీణ జీవనశైలి, సాంప్రదాయాలు, కులవృత్తుల నేపథ్యాన్ని ఈ పాట ఆవిష్కరిస్తుంది. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించగా, భీమ్స్ సెసిరోలియో సంగీతం సమకూర్చారు. కేకే రాధామోహన్ నిర్మాతగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
శర్వా 'భోగి' నుంచి 'ఎగిలివరంగ' సాంగ్ విడుదల
Source: Gulte Telugu