అక్టోబర్ 10న ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరాల్సిన 38 రైళ్లను ఉత్తర రైల్వే రద్దు చేసింది. ఈ స్టేషన్ల పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర రైల్వే సీపీఆర్వో హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఆనంద్ విహార్ టెర్మినల్, సరాయ్ రోహిల్లా, పాత ఢిల్లీ, ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్లలో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయి.
ఢిల్లీలో అక్టోబర్ 10న 38 రైళ్లు రద్దు
Source: Webdunia Telugu