తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుర్తింపు సంఘం ఎన్నికల్లో EU కూటమి సుమారు 4,500 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించినట్లు సమాచారం. ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ మద్దతున్న TWU కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఈ నెల 17న అధికారిక తుది ఫలితాలు ప్రకటించనున్నారు.
TGSRTC గుర్తింపు సంఘం ఎన్నికల్లో EU కూటమి విజయం
Source: Vaartha