నటుడు శివారెడ్డి తన స్నేహితుడి మోసం కారణంగా 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టపోయానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మణికొండలో 11 లక్షలకే దొరికిన రెండెకరాల భూమిని కొనకుండా స్నేహితుడు వారించడంతో ఆ స్థలం ఇప్పుడు 50 కోట్లకు పైగా విలువ చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. 70 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వని మరో స్నేహితుడి ఘటనను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.
స్నేహితుడి మోసంతో 100 కోట్లు కోల్పోయిన నటుడు శివారెడ్డి
Source: Asianet Telugu