ఎస్.ఎస్. రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’లో రామాయణ ఘట్టం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఓ పాడ్‌కాస్ట్‌లో రాజమౌళి మాట్లాడుతూ, రామాయణం వంటి ఇతిహాసాలకు తెరపై పూర్తి న్యాయం జరగలేదని, ఆ సవాలే ఈ ఘట్టానికి ప్రేరణ అని చెప్పారు. భారీ విజువల్స్‌తో పాటు పాత్రల భావోద్వేగాలకూ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వివరించారు.
‘వారణా�సి’లో రామాయణ ఘట్టంపై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు
Source: Chitrajyothy