అనీశ్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఇట్లు అర్జున' చిత్ర ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. తొలి చిత్రంలోనే మూగవాడి పాత్రను ఎంచుకున్న అనీశ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మహేశ్ ఉప్పాల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, అక్కినేని నాగార్జున ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 13న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా 'ఇట్లు అర్జున' ట్రైలర్ విడుదల
Source: Vaartha