ఆంధ్రప్రదేశ్‌లో నేడు 582 జడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు 31,472 కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. మురసు తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో ఎన్నిక వాయిదా పడింది. 1,841 అత్యంత సమస్యాత్మక కేంద్రాలతో పాటు మొత్తం 2,645 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి భద్రత పెంచారు. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
Source: Telugu Post