ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌లో రోడ్లు, తాగునీరు, వైద్యం వంటి సమస్యలపై పలు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. గుంటూరులో బ్యాలెట్ బాక్స్ తరలింపుపై వివాదం చెలరేగి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాలో బ్యాలెట్ బాక్స్ ధ్వంసం ఘటనపై 60 మందిపై కేసు నమోదైంది.
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు: పలు గ్రామాల బహిష్కరణ, అరెస్టులు
Source: telugutimes.net