హైదరాబాద్ ధూల్‌పేటకు చెందిన గంజాయి 'క్వీన్' నిత్తూబాయిని ఈగల్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తెప్పించి నగరంలో విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కిరాణా దుకాణం ముసుగులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. 2020 నుంచి ఆమెపై 30 కేసులు నమోదైనట్లు పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి.
గంజాయి 'క్వీన్' నిత్తూబాయి అరెస్టు
Source: Vaartha