కొడంగల్‌కు రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తుంటే, మునుగోడుకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. మునుగోడులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పలుమార్లు కలిసినా నిధులు రాలేదని ఆరోపించారు. అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూడాలని కోరారు.
మునుగోడుకు నిధులు ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్
Source: Mana Telangana