ప్రముఖ నటి షావుకారు జానకి (94) చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 21న తుదిశ్వాస విడిచారు. దాదాపు 400 సినిమాల్లో నటించిన ఆమెకు 2022లో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'షావుకారు' చిత్రంతో తొలిసారి కథానాయికగా అవకాశం దక్కించుకున్న ఆమె, ఆ సినిమాకు రూ.2,500 పారితోషికం అందుకున్నారు.
షావుకారు జానకి కన్నుమూత.. తొలి పారితోషికం రూ.2,500
Source: Vaartha