రాబోయే సంక్రాంతి సీజన్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒకేసారి పలు పెద్ద చిత్రాలు విడుదల కావడంతో థియేటర్ల కేటాయింపులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
సంక్రాంతి బరిలో స్టార్ హీరోల భారీ పోటీ
Source: Chitrajyothy