విశాఖపట్నం జిల్లాలోని 11 మండలాల్లో 399 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించి, 28,445 కుటుంబాలకు ఇళ్ల స్థలాల హక్కు పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 23,283 మందికి కన్వేయన్స్ డీడ్లు, 5,162 మందికి పట్టాలు అందనున్నాయి. రూ.8,874 కోట్ల విలువైన ఈ భూముల క్రమబద్ధీకరణ విశాఖలో తొలిసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పత్రాలను పంపిణీ చేయనున్నారు.
విశాఖలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
Source: Vaartha