తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నిన్న గరుడ వాహన సేవకు లక్షలాది మంది హాజరయ్యారు. నేడు సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు దర్శనానికి సుమారు ఎనిమిది గంటలు పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 8 గంటలు
Source: Asianet Telugu