అమరావతి రాజధాని పరిధిలో ప్రజా రవాణా కోసం మాస్ ట్రాన్స్‌పోర్ట్ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన 66వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల స్పియర్ టవర్ నిర్మాణానికి రూ.661 కోట్లతో ఆమోదం లభించింది. 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.1,548 కోట్ల టెండర్లకు, రెండో దశలో ఎకరా లోపు రైతులకు యాన్యుటీ చెల్లింపునకు ఆమోదం తెలిపారు.
అమరావతిలో మాస్ ట్రాన్స్‌పోర్ట్ ప్రణాళికకు సీఎం చంద్రబాబు ఆదేశం
Source: telugutimes.net