వాయవ్య పాకిస్థాన్‌లోని కోహట్ పోలీస్ సముదాయంపై శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 21 మంది మృతి చెందగా, 103 మంది గాయపడ్డారు. 20 గంటల ఆపరేషన్ అనంతరం భద్రతా బలగాలు ఎనిమిది మంది దుండగుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ దాడి వెనుక అఫ్గానిస్థాన్‌లో మూలాలున్న ఉగ్రవాదులున్నారని పాకిస్థాన్ ఆరోపించింది.
పాకిస్థాన్‌లో పోలీస్ సముదాయంపై దాడి, 21 మంది మృతి
Source: Telugu Post