వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో డీజే సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి ఇవ్వాలనే డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు తన నియోజకవర్గంలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అధిక శబ్దం వల్ల యువకులు గుండె సమస్యలతో మృతి చెందుతున్న ఘటనలను ఆయన ఉదాహరణలుగా చూపారు. యువకులు డీజే లేకుండా ఊరేగింపు నిర్వహించేందుకు అంగీకరించడంతో ఆయన వారిని అభినందించారు.
డీజే అనుమతిపై ఆర్ఆర్ఆర్ సమతూక నిర్ణయం
Source: Gulte Telugu