ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురంలో రెండు రోజుల పర్యటన చేపట్టనున్నారు. సుమారు రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పట్టణంలో రూ.200 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, గొల్లప్రోలులో రూ.80 కోట్ల వాటర్ వర్క్స్, అమృత్ 2.0 కింద తాగునీటి ప్రాజెక్టు ప్రారంభమవుతాయి. స్వయం సహాయక సంఘాలకు రూ.120 కోట్ల రుణ చెక్కుల పంపిణీ కూడా జరుగుతుంది.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ రెండు రోజుల పర్యటన
Source: telugutimes.net