గుంటూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల సమన్వయ బాధ్యతలను కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు టీడీపీ అధిష్టానం అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. జనసేన, బీజేపీ నేతల అభిప్రాయాలు తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఖరారు చేసేందుకు కసరత్తు ముమ్మరమైంది.
గుంటూరు మేయర్ ఎంపిక బాధ్యత పెమ్మసానికి
Source: telugutimes.net