తెలంగాణలో 2.50 లక్షల కొత్త చేయూత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, అక్టోబర్ మొదటి వారంలో అర్హుల జాబితా సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దసరా పండుగ సందర్భంగా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. అనర్హులు, డబుల్ పింఛన్లు, మృతి చెందిన వారి పేర్లను తొలగించేందుకు సోషల్ ఆడిట్ నిర్వహించనున్నారు.
కొత్త చేయూత పింఛన్ల పంపిణీకి తెలంగాణ సన్నాహాలు
Source: Vaartha