నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమా టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోకు అనుమతి ఇస్తూ జారీ చేసిన మెమోను పునఃపరిశీలించి వెనక్కి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్‌కు ఆదేశాలు జారీ చేసింది. జీవో 77 షరతులకు విరుద్ధంగా మెమో ఉందని ధర్మాసనం తప్పుబట్టింది. వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తూ విచారణను అక్టోబరు 6కు వాయిదా వేసింది.
ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు మెమో వెనక్కి తీసుకోండి: హైకోర్టు ఆదేశాలు
Source: Chitrajyothy