ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం ప్రత్యేక పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా కేటగిరీలు విభజించి, లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నవారికి గరిష్ఠంగా రూ.15 వేల వరకు, 50 వేల నుంచి 99,999 మందికి రూ.7,500, 25 వేల నుంచి 49,999 మందికి రూ.5 వేలు, 10 వేల నుంచి 24,999 మందికి రూ.2,500 చెల్లించనున్నారు. విశ్వసనీయత, రీచ్, కంటెంట్ నాణ్యత ప్రాతిపదికన ఎంపిక చేసి గుర్తింపు ఇవ్వనున్నారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఏపీ ప్రభుత్వం చెల్లింపులు
Source: Asianet Telugu