పెద్దపల్లి జిల్లాలో యువతి మరణం ఆత్మహత్య కాదని, హత్య అని పోలీసులు వెల్లడించారు. సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్ జెట్టి నవీన్ కుమార్‌ను ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు. ప్రేమ వ్యవహారంతో పురుగుల మందు తాగించి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. ఓవర్‌మన్ బొమ్మకంటి రవికుమార్‌ను కూడా విచారణకు తీసుకున్నారు.
పెద్దపల్లిలో ఆత్మహత్య కాదు.. హత్యే: లెక్చరర్ అరెస్ట్
Source: Webdunia Telugu