తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఏపీలో గత 24 గంటల్లో 80కి పైగా ప్రాంతాల్లో 100 మిమీ దాటిన వర్షపాతం నమోదైంది. అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్
Source: Asianet Telugu