ఆసియా క్రీడల పురుషుల హాకీలో భారత్ దక్షిణ కొరియాపై 8-2తో భారీ విజయం సాధించింది. వరుసగా మూడో గెలుపుతో భారత్ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. తొలి మ్యాచ్‌ల్లో ఇండోనేషియా (13-1), శ్రీలంక (16-1)ను ఓడించిన భారత్, ఇప్పుడు బలమైన కొరియాను కూడా చిత్తు చేసి హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. తదుపరి గ్రూప్ మ్యాచ్ సెప్టెంబర్ 26న ఆతిథ్య జపాన్‌తో.
ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియాపై భారత్ 8-2 ఘన విజయం
Source: Vaartha