తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, విశాఖపట్నం, ఎన్టీఆర్, అనకాపల్లి, కృష్ణా, పోలవరం జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే, గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇచ్చారు.
భారీ వర్షాల కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
Source: Vaartha