ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,092 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. పారదర్శకంగా థర్డ్ పార్టీ ఏజెన్సీని ఎంపిక చేసి, ఆ సంస్థ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. టెండర్ల దాఖలుకు రేపటితో గడువు ముగియనుండగా, ఎంపికైన ఏజెన్సీ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఎంపికైన వారికి నెలకు రూ.12,000 నుంచి రూ.18,000 వరకు వేతనం లభించనుంది.
ఏపీలో కేజీబీవీ 1,092 ఉద్యోగాలకు నోటిఫికేషన్
Source: Vaartha