కోడి ముందా, గుడ్డు ముందా అనే శతాబ్దాల పజిల్‌కు శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. ఇంగ్లండ్, స్కాట్లాండ్ పరిశోధకులు సూపర్ కంప్యూటర్ సాయంతో గుడ్డు పెంకు తయారీపై అధ్యయనం చేశారు. పెంకు ఏర్పడటానికి అవసరమైన ప్రోటీన్ కోడి శరీరంలోనే ఉత్పత్తి అవుతుందని తేలింది. కాబట్టి గుడ్డు కంటే కోడే ముందు వచ్చిందని పరిశోధన నిరూపించింది.
కోడి ముందా? గుడ్డు ముందా? శాస్త్రవేత్తలు జవాబు కనుగొన్నారు
Source: Asianet Telugu