పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ వల్ల గోదావరి వెనుక జలాలు ఉప్పొంగి తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు తీవ్ర ముంపు ప్రమాదం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భద్రాచలం సహా పరిసర గ్రామాలు నీటమునిగే ముప్పుపై నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు. కరకట్టలు, పంపింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
పోలవరం బ్యాక్ వాటర్‌తో తెలంగాణకు ముప్పు: కేంద్రానికి లేఖ
Source: Vaartha