బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో శనివారం రాత్రి 'ప్యారడైజ్' సినిమాను పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి చూశారు. అనంతరం సోషల్ మీడియాలో స్పందిస్తూ, అస్థిత్వం కోసం పడే ఆరాటాన్ని, అణచివేతపై సాగించే పోరాటాన్ని చిత్రం ప్రతిభావంతంగా చిత్రీకరించిందని ప్రశంసించారు. దర్శకుడు శ్రీకంత్‌ను, చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
కేటీఆర్ 'ప్యారడైజ్' సినిమా వీక్షించి ప్రశంసలు
Source: Vaartha