యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదిత ఎండీఆర్ ఛార్జీలకు వ్యతిరేకంగా అక్టోబర్ 2న పిలుపునిచ్చిన 'నో యూపీఐ డే' నిరసనను వ్యాపార సంఘాలు ఉపసంహరించుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశం సానుకూలంగా సాగినట్లు సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. రూ.2,000కు మించిన మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఫీజు ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తమైంది.
యూపీఐ ఎండీఆర్ నిరసన ఉపసంహరణ
Source: Vaartha