అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) బోర్డు ట్రస్టీ స్థానాల భర్తీకి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 2027–2030 పదవీకాలానికి మొత్తం 16 ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. లైఫ్ సభ్యుల విభాగం నుంచి అత్యధికంగా 10 స్థానాలు, గ్రాండ్ ప్యాట్రన్, ప్యాట్రన్ విభాగాల నుంచి చెరో 3 స్థానాలు కేటాయించారు. అక్టోబర్ 15, 2026 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
ఆటా బోర్డు ట్రస్టీల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
Source: telugutimes.net