దసరా సెలవుల్లో కశ్మీర్ సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సిటిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఐదు రాత్రులు, ఆరు రోజుల ఈ టూర్‌లో శ్రీనగర్, సోన్‌మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ ప్రాంతాలు చేర్చారు. విమాన ప్రయాణం, హోటల్ వసతి, అల్పాహారం, రాత్రి భోజనం, టూర్ ఎస్కార్ట్ సేవలు ప్యాకేజీలో ఉన్నాయి. గోండోలా, పోనీ వంటి స్థానిక రవాణా ఖర్చులు మాత్రం పర్యాటకులే భరించాలి.
హైదరాబాద్ నుంచి కశ్మీర్ టూర్‌కు ఐఆర్‌సిటిసి ప్రత్యేక ప్యాకేజీ
Source: Asianet Telugu