అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ రూ.11,537.70 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించింది. 195.13 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టులో 189.93 కి.మీ. ఆరు వరుసల రహదారి, నారాకోడూరు నుండి బుడంపాడు వరకు 5.2 కి.మీ. నాలుగు వరుసల కనెక్టింగ్ రోడ్డు ఉన్నాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో అమలవుతుంది. బిడ్లు నవంబర్ 18 వరకు స్వీకరించి, 19న తెరవనున్నారు.
అమరావతి ఓఆర్‌ఆర్‌కు టెండర్లు ప్రారంభం
Source: Vaartha