ముంబై–బెంగళూరు మధ్య రెండో వందేభారత్ స్లీపర్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు వారంలో ఆరు రోజులు నడుస్తుంది. ప్రయాణ సమయం సుమారు 16 గంటలు కాగా, ప్రస్తుతం ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో 22 గంటలు పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఆగుతుంది. ప్రారంభ తేదీ, ఛార్జీలపై రైల్వే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ముంబై–బెంగళూరు మధ్య రెండో వందేభారత్ స్లీపర్ రైలు
Source: Asianet Telugu