దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన 'సిగ్మా' శుక్రవారం విడుదలైంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో వచ్చింది. కుమారుడి తొలి సినిమాకు విజయ్ ఎలాంటి ప్రచారం చేయకపోవడం, స్పెషల్ షోకు రాకపోవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తెలుగులో సిగ్మా మిశ్రమ ఫలితం అందగా, ప్రమోషన్లు, స్టార్ పవర్ లేకపోవడమే కారణమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయ్ ప్రచారం చేయకపోవడంపై చర్చ
Source: Chitrajyothy