మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోయే హారర్ కామెడీ థ్రిల్లర్‌కు 'తులాభారం' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లక్ష్మణ్, శ్రీని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే దసరాకు పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇరుముడి విజయం తర్వాత రవితేజ ఎంపికపై భారీ అంచనాలున్నాయి.
రవితేజ నెక్స్ట్ మూవీకి 'తులాభారం' టైటిల్?
Source: Asianet Telugu