జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీజీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీ సేవలను, అహింసా మార్గాన్ని ఆయన స్మరించుకున్నారు. సత్యం, అహింస, స్వదేశీ సూత్రాలతో వికసిత భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.
గాంధీ జయంతి: రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి మోదీ నివాళి
Source: telugutimes.net