రైతులు, యువత (జెన్ జెడ్), దళితులు, గిరిజనులు, మహిళలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. వారి హక్కుల సాధన కోసం అందరం కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే పార్లమెంట్‌తో పాటు వీధుల్లోకి వచ్చి ప్రజల తరఫున నిలబడతానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ‘సత్యాగ్రహ’ డిజిటల్ పోర్టల్‌ను (rahulgandhi.in) ప్రారంభించారు.
రైతులు, యువత, దళితుల హక్కుల కోసం కలిసి పోరాడదాం: రాహుల్ పిలుపు
Source: Vaartha